గ్యాస్ వినియోగదారుల నెత్తిన బండ.. కొత్త సెస్‌తో మోడీ సర్కార్ రూ.4 లక్షల కోట్లు వసూళ్ల ప్లాన్..!

Share: X Facebook
modi-government-plans-new-cess-on-lpg-and-natural-gas-users_cmS4f69toa

మోడీ సర్కార్ గ్యాస్ వినియోగదారులపై కొత్త సెస్ ప్రతిపాదన

Indiabreakingdaily.com – గ య స వ న య గద – పశ్చిమాసియా ప్రాంతంలోని ఇరాన్ ఘర్షణలు ఇంధన సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి భారీ స్థాయిలో వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా వంట గ్యాస్, నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కొత్త సెస్ విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది.

గ్యాస్ వినియోగదారులపై సెస్ ప్రభావం

రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ కొత్త భారం వేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం, ఎల్పీజీపై కిలోకు రూ.1.29 చొప్పున సెస్ విధించే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై దాదాపు రూ.18 అదనపు ఖర్చు వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. అలాగే నేచురల్ గ్యాస్ పై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.1.43 సెస్ విధించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ రెండు సెస్‌ల ద్వారా కేంద్రానికి ప్రతి ఏడాది సుమారు రూ.14వేల కోట్లు సమకూరే అవకాశం ఉందని వెల్లడైంది.

ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం వచ్చే పదేళ్లలో రూ.4లక్షల 30వేల కోట్ల వ్యయంతో భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ, క్రూడ్ ఆయిల్ నిల్వల కోసం ప్రత్యేక స్టోరేజీ కేంద్రాలు నిర్మించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఇంధన నిల్వలను సిద్ధంగా ఉంచనున్నారు. ఈ ప్రాజెక్టులో ఎల్పీజీ, సహజ వాయువు నిల్వల మౌలిక వసతుల కోసం వినియోగదారుల నుంచి వసూలు చేసే సెస్‌ను వినియోగించే అవకాశం ఉంది.

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి కారణంగా భారత ఇంధన భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారైన భారత్ తన అవసరాల్లో దాదాపు 90 శాతం చమురును దిగుమతులపైనే ఆధారపడుతోంది. సరఫరాలో అంతరాయం ఏర్పడితే దేశీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ముందస్తు నిల్వలపై కేంద్రం దృష్టి పెట్టింది.

అయితే ఈ ప్రతిపాదనపై ఇంకా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇంకా దీనికి ఆమోదం తెలపలేదు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. దేశవ్యాప్తంగా కోట్లాది గ్యాస్ వినియోగదారుల నెలవారీ వంటగ్యాస్ ఖర్చు సుమారు 2 శాతం వరకు పెరుగుతుంది.

గ్యాస్ వినియోగదారుల ప్రశ్నలు – సమాధానాలు

1. కొత్త సెస్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ప్రస్తుతం మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత మాత్రమే ఈ సెస్ అమల్లోకి వస్తుంది.

2. గృహ వినియోగదారులపై ఎంత అదనపు ఖర్చు వస్తుంది? 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ.18 అదనపు ఖర్చు వినియోగదారులు భరించాల్సి ఉంటుంది.

3. ఈ సెస్ ద్వారా కేంద్రానికి ఎంత ఆదాయం వస్తుంది? ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం వచ్చే పదేళ్లలో రూ.4లక్షల 30వేల కోట్ల వ్యూహాత్మక నిల్వల ప్రాజెక్టు అమలు అవుతుంది.

4. నేచురల్ గ్యాస్ వినియోగదారులపై కూడా సెస్ ఉంటుందా? అవును, నేచురల్ గ్యాస్ పై ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.1.43 సెస్ విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Frequently Asked Questions

What is గ య స వ న య గద?

గ య స వ న య గద is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does గ య స వ న య గద matter?

గ య స వ న య గద matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *