క్రెడిట్ కార్డుల మీదే బతుకుతున్న అమెరికన్స్.. అప్పుల ఒత్తిడిలో జీవితాలు

americans-living-on-debt-credit-card-balances-hit-record-highs_cChd3bFW4B

అప్పుల బాధ్యత పెరుగుతున్న అమెరికా పరిస్థితి

Indiabreakingdaily.com – క ర డ ట క ర డ – న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ తాజా నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో అమెరికన్ల క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌లు గణనీయంగా పెరిగాయి. మూడు నెలల కాలంలో ఈ అప్పులు 1.7 శాతం పెరిగి 1.26 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది సుమారు రూ.12 లక్షల కోట్లకు సమానం. గత సంవత్సరం నమోదైన 1.28 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి ఇది చాలా దగ్గరగా ఉంది.

ద్రవ్యోల్బణం మరియు ఖర్చుల ప్రభావం

పెరుగుతున్న జీవన ఖర్చులు మరియు ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల అనేక అమెరికన్ కుటుంబాలు ప్రతీ నెలా జీతం వచ్చే వరకు అప్పుల మీదే ఆధారపడుతున్నాయి. ఈ త్రైమాసికంలో అగ్రిగేట్ క్రెడిట్ కార్డు పరిమితులు కూడా 85 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇది సుమారు రూ.8 లక్షల 7వేల 500 కోట్లకు సమానం. లెండర్లు మరింత క్రెడిట్ అందుబాటులోకి తెస్తుండటంతో అమెరికన్లు తమ రోజువారీ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.

డెలినాక్వెన్సీ రేట్లలో మార్పులు

ఈ భారీ అప్పుల పెరుగుదలపై విశ్లేషకులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 90 రోజులు దాటిన డెలినాక్వెన్సీ రేట్లు 7.6 శాతం నుంచి 12.8 శాతానికి పెరిగినప్పటికీ, కొత్తగా డిఫాల్ట్ అవుతున్న వారి రేటు మాత్రం స్థిరంగానే ఉందని న్యూయార్క్ ఫెడ్ స్పష్టం చేసింది. లెండర్లు ఎక్కువ కాలం పాటు పాత, రద్దు చేసిన బకాయిలను రిపోర్ట్ చేస్తుండటం వల్లే స్టాక్ డెలినాక్వెన్సీ రేటు పెరుగుతున్నట్లు కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి అమెరికన్ ప్రజలు క్రెడిట్ కార్డుల్లో అప్పులు వాడుతున్నప్పటికీ, చెల్లింపుల్లో పెద్ద ఎత్తున ఎగవేతలు లేవని డేటా చెబుతోంది. కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భవిష్యత్తు ఆందోళనలు

పెరిగిన జీవన ఖర్చులు, కాంపౌండింగ్ వడ్డీల కారణంగా ఈ స్వల్పకాలిక అప్పులు త్వరలోనే కుటుంబ బడ్జెట్‌లను ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని అచీవ్ కో-సీఈఓ బ్రాడ్ స్ట్రో హెచ్చరించారు. భవిష్యత్తులో ఈ భారీ బ్యాలెన్స్‌లు కాస్తా చెల్లింపలేని బకాయిలుగా మారితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దీనివల్ల అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సామాన్య అమెరికన్లకు భవిష్యత్తులో ఈ ఆర్థిక భారం ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు.

Frequently Asked Questions

What is క ర డ ట క ర డ?

క ర డ ట క ర డ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does క ర డ ట క ర డ matter?

క ర డ ట క ర డ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *