కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్‎దే: మంత్రి కోమటిరెడ్డి

minister-komatireddy-venkat-reddy-criticizes-kcr_Fys45cNQPt

Indiabreakingdaily.com – క ష ణ జల ల ల త – హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్‎దేనని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఏపీ ప్రతిపాదిత పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కెపాసిటీ రెట్టింపు చేసి రోజుకు 10 టీఎంసీల నీటిని అక్రమంగా తరించేలా కేసీఆర్ సహకరించాడని ఆరోపించారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోలేని పరిస్థితికి కూడా కారణం కేసీఆరేనని విమర్శించారు.

ఇప్పటికే ఏపీ దొంగతనంగా కృష్ణా జలాలను తరలించకపోతుందని కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు పాదయాత్ర చేయాలని.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల్లో ఎందుకు అన్యాయం చేశాడో ఆయన తండ్రిని నిలదీయాలని సూచించారు.

సోమవారం (సెప్టెంబర్ 14) వినాయక చవితి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పలు ఆలయాలు, పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ట్రం పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని.. ప్రజలు ఏ పని ప్రారంభించిన ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచి జరగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్‎తో మూడు సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పారు.

ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‎కు మొదటి మేయర్‎గా మహిళను చేసి రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో డబుల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రాబోయే రెండేళ్లలో ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన డబుల్ రోడ్లను పూర్తి చేస్తామని తెలిపారు.

Frequently Asked Questions

What is క ష ణ జల ల ల త?

క ష ణ జల ల ల త is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does క ష ణ జల ల ల త matter?

క ష ణ జల ల ల త matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *