IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

కడెం గేట్లకు ట్రాష్ రాక్ రక్షణ..రూ.2.60 కోట్లతో మెయిన్ కెనాల్ పనులు

Published June 7, 2026 · Updated July 21, 2026 · By Nancy Anderson - indiabreakingdaily.com

Foto : Nancy Anderson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – కడ గ ట లక ట ర ష - నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లాలోని ప్రధాన నీటి వనరు కడెం ప్రాజెక్టులోని కీలకమైన ప్రధాన కాలువ(మెయిన్ కెనాల్)కు సంబంధించిన గేట్లను పరిరక్షించేందుకు కార్యాచరణ మొదలైంది. ఇందుకోసం మెయిన్ కెనాల్ వద్ద ట్రాష్ రాక్ ను నిర్మిస్తున్నారు. వర్షం కురిసిన సమయంలో అటవీ ప్రాంతం నుంచి వరదతో పాటు కొట్టుకొచ్చే కలప దుంగలు, చెట్లు, చెత్తాచెదారంతో మెయిన్ కెనాల్ గేట్లు దెబ్బతింటున్నాయి.

వీటి కారణంగా గేట్లు నుంచి వరద ప్రవాహానికి అడ్డంకులు తలెత్తుతున్నాయి. పంటల కోసం కాలువ ద్వారా నీటిని కిందకు విడుదల చేసేటప్పుడు దుంగలు, చెట్ల కొమ్మలు గేట్లకు అడ్డంగా ఉండి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అడ్డంగా ఉన్న దుంగల కారణంగా పంటలకు నీరు అందించిన తర్వాత కూడా గేట్లను మూసివేయడం అధికారులకు సవాలుగా మారుతోంది. గేట్ల మధ్య చెట్ల కొమ్మలు చిక్కుకోవడంతో కొన్ని సమయాల్లో నీరు వృథాగా పోతోంది.

ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన కాలువ వద్ద శాస్త్రీయ పద్ధతిలో ట్రాష్ రాక్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. కెనాల్ వైపునకు వరదతోపాటు ప్రవహించే చెట్ల కొమ్మలు, కలప దుంగలు, చెత్తను అడ్డుకునేందుకు ట్రాష్ రాక్ ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భారీ సిమెంట్ దిమ్మెలు, ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాష్ రాక్ నిర్మాణంతో ప్రధాన కాలువ గేట్లకు ఇకపై ఎలాంటి నష్టం జరగదని అధికారులు చెబుతున్నారు. నిర్మాణం పూర్తయితే కాలువ గేట్లకు రక్షణతో పాటు గేట్ల నుంచి నీటి విడుదల చేసేందుకు, పైకెత్తిన గేట్లను కిందకు దింపేటప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తవని స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కడెం ప్రాజెక్టుపై ఫోకస్​పెట్టింది. ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజులకే రూ.11 కోట్లతో ప్రధాన గేట్ల ఆధునికీకరణ పనులు, కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసింది. స్పిల్ వే రిపేర్లు, జనరేటర్ లాంటివి ఏర్పాటు చేయడంతో మొన్నటి వరదల నుంచి ప్రాజెక్టు సురక్షితంగా బయటపడింది. తాజాగా మెయిన్ కెనాల్ ఆధునికీకరణ కోసం రూ.2.60 కోట్లు మంజూరు చేసింది.

నిధులు మంజూరు కాగానే అధికారులు ఇదివరకే రూపొందించిన ప్రతిపాదనల మేరకు రాక్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాలు రాకముందే పనులు పూర్తిచేయాలని అధికారులు శ్రమిస్తున్నారు. ట్రాష్ రాక్ నిర్మాణం పూర్తయితే మెయిన్ కెనాల్ ద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు పూర్తిస్థాయిలో సాగునీరందించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.