ఓట్ చోరీకి వ్యతిరేకంగా.. సుప్రీంకోర్టుకు పాదయాత్ర..యువతకు రాహుల్ గాంధీ పిలుపు
Indiabreakingdaily.com – ఓట చ ర క వ యత ర - ఢిల్లీ నిరసనల్లో విద్యార్థులు, యువతపై పోలీసులు, బీజేపీ గుండాల దాడిని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో నిరసనలకు వచ్చిన యువతపై దాడి దారుణంగా అన్నారు. పార్టీలు , కులాలు, మతాలు , లింగ, ప్రాంతీయ భేదాలను పక్కన బెట్టి భారతీయులుగా సర్ ప్రక్రియను ఐక్య పోరాటానికి ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.
ఓట్ చోరీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)కు వ్యతిరేకంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సోమవారం (అక్టోబర్12) దేశ యువత, ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజ ప్రతినిధులు కలిసి సుప్రీంకోర్టుకు పాదయాత్రగా వెళ్లనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన యువతపై పోలీసులు, బీజేపీ మద్దతుదారులు దాడి చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. యువత ద్వేషంతో కాకుండా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో నిరసనలో పాల్గొన్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు తాము కోరుకునే భారతదేశానికి ప్రతీక కాదని అన్నారు.
పార్టీలు, కులాలు, మతాలు, లింగం, ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి భారతీయులుగా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు తావులేకుండా చూడాలని, SIR ప్రక్రియను నిలిపివేయాలని తమ ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు తమ పోరాటం అడ్డుకోలేరని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రేమ, సోదరభావం, దేశభక్తితో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతే తమ లక్ష్యమని అన్నారు రాహుల్ గాంధీ.
Related Reading
Frequently Asked Questions
What is ఓట చ ర క వ యత ర?ఓట చ ర క వ యత ర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ఓట చ ర క వ యత ర matter?ఓట చ ర క వ యత ర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.