ఎమ్మెల్యేల క్యాంటిన్ లోనే బొద్దింకలు.. కంపు కొట్టే ఇడ్లీలు

అసెంబ్లీ క్యాంటిన్‌లో అద్భుతాలు కాదు.. అద్భుతమైన షాక్!

Indiabreakingdaily.com – ఎమ మ ల య ల క య – రాష్ట్ర అసెంబ్లీ భవనంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా అనేక మంది ప్రముఖులు కూడా వస్తుంటారు. ఇటువంటి ప్రతిష్టాత్మక ప్రదేశంలోని క్యాంటిన్ గురించి అనుకునేది ఏమిటంటే.. అదిరిపోయే ఆహార పదార్థాలు, శుభ్రమైన వాతావరణం. కానీ కర్నాటక అసెంబ్లీలోని ఎమ్మెల్యేల క్యాంటిన్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీ వారిని షాక్‌లో పడేసింది.

బుధవారం రైడ్‌లో బయటపడిన నిజాలు

గత కొన్ని రోజులుగా బెంగళూరు నగరంలోని చిన్న హోటళ్ల నుండి స్టార్ హోటళ్ల వరకు అన్నింటినీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలోని హోటళ్లపై రైడ్ నిర్వహించారు. ఈ తనిఖీలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

విధాన సౌధ సమీపంలోని లెజిస్లేటర్స్ హౌస్‌లో ఉన్న మల్లిగే హోటల్ రెస్టారెంట్ వంటగదిలో బొద్దింకలు కనిపించాయి. హోటల్ మొత్తం నుండి కంపు వస్తుందని అధికారులు గమనించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వచ్చే ఈ హోటల్‌లో కూడా ఆహార పదార్థాలలో లోపాలు బయటపడ్డాయి.

మాగడి రోడ్డులోని ఆరోగ్య సౌధ క్యాంటీన్‌లో కూడా అధికారులు తనిఖీలు చేశారు. హోటల్ మొత్తం అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఇడ్లీలు, రవ్వ, కొబ్బరి పొడి వంటి కుళ్లిన ఆహార పదార్థాలు కనిపించాయి.

గోదాంలో కూడా లోపాలు.. చికెన్ సీజ్

నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు ఆహార పదార్థాలు సరఫరా చేసే ఒక గోదాంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ నిల్వ ఉంచిన 146 కిలోల చికెన్‌ను సీజ్ చేశారు. FSSAI లైసెన్స్ లేకుండా అడ్డదారిలో కుళ్లిన నాన్ వెజ్ పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించారు.

దీంతోపాటు 40 కిలోల కాలం చెల్లిన వెల్లుల్లి పేస్ట్ కూడా బయటపడింది. నకిలీ బ్రాండ్ లేబుళ్లతో బియ్యం, డ్రై ఫ్రూట్స్, మసాలాలు అమ్ముతున్నట్లు తనిఖీల్లో తెలిసింది. రూల్స్ ఉల్లంఘించిన దుకాణాలకు అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Frequently Asked Questions

What is ఎమ మ ల య ల క య?

ఎమ మ ల య ల క య is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఎమ మ ల య ల క య matter?

ఎమ మ ల య ల క య matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *