IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ఇంజనీర్లను అవమానిస్తరా?..సీఎం రేవంత్‌‌‌‌తో రాహుల్‌‌‌‌ క్షమాపణ చెప్పించాలి: కేటీఆర్‌‌‌‌‌‌‌‌

Published August 3, 2026 · Updated August 3, 2026 · By Nancy Anderson - indiabreakingdaily.com

Foto : Nancy Anderson - indiabreakingdaily.com

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ నుండి రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ

Indiabreakingdaily.com – ఇ జన ర లన అవమ న స - దేశ అభివృద్ధికి, సాంకేతిక మార్పులకు ఆధారభూతమైన ఇంజనీర్లను సీఎం రేవంత్ రెడ్డి అవమానించిన విషయంపై స్పందించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపైనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లను సీఎం రేవంత్ రెడ్డి 'క్రిమినల్ వేస్ట్' అని ఎలా అంటారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీయే అసలు క్రిమినల్ వేస్ట్

అసలు క్రిమినల్ వేస్ట్ వాళ్లు కాదని, కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల హామీల పేరుతో తెలంగాణ యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే అసలు క్రిమినల్ వేస్ట్ అని ఆయన అన్నారు. తెలంగాణ యువత రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను, కాంగ్రెస్ వైఖరిని గమనిస్తోందని, సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ వెంటనే తమ తప్పును సరిదిద్దుకొని, రేవంత్ రెడ్డితో క్షమాపణ చెప్పించడంతో పాటు రాహుల్ గాంధీ కూడా తెలంగాణ యువతకు, ఇంజనీర్లకు, ఉపాధ్యాయులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇంజనీర్ల ప్రతిభను గుర్తించాలి

మనదేశ ఇంజనీర్లు తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద ఎంఎన్‌‌‌‌సీలను నడుపుతున్నారని, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతూ దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అలాంటి వారిని రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అనడం ఆయన అజ్ఞానానికి, దిగజారుడు రాజకీయ నాయకత్వానికి నిదర్శనమన్నారు.

విద్యార్థులకే కాకుండా, వారిని తీర్చిదిద్దుతున్న లెక్చరర్లను కూడా రేవంత్ తక్కువ చేసి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. యువత రేపటి భారతదేశ నిర్మాతలంటూ వేదికలపై రాహుల్ గాంధీ ప్రసంగాలకు, ఆయన పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదని విమర్శించారు.

యువతపై రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిన నోరు

రేవంత్ రెడ్డికి యువత, విద్యార్థులపై నోరు పారేసుకోవడం అలవాటుగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులను 'బీరు బిర్యానీ బ్యాచ్' అంటూ అవమానించారని, ప్రశ్నించే వారిపై నిందలు వేయడం ఆయనకు నైజంగా మారిందని మండిపడ్డారు.

యువశక్తి శక్తి ఏంటో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగేస్తే తెలుస్తుందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో యువత తిరగబడితే ఇందిరా గాంధీ ప్రభుత్వానికి ఏం జరిగిందో గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో యూపీఏ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యువత తిరగబడి, కాంగ్రెస్ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తీరును రాహుల్ గాంధీ మరచిపోకూడదని పేర్కొన్నారు.

Related Reading

Frequently Asked Questions

What is ఇ జన ర లన అవమ న స?

ఇ జన ర లన అవమ న స is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఇ జన ర లన అవమ న స matter?

ఇ జన ర లన అవమ న స matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.