IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ఆ భయంతో ఇన్సూరెన్స్ కొంటున్న జెన్ జెడ్ కుర్రోళ్లు.. ఎక్కువ కవరేజ్ ప్లాన్స్‌కి డిమాండ్

Published May 28, 2026 · Updated July 21, 2026 · By Daniel Wilson - indiabreakingdaily.com

Foto : Daniel Wilson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ఆ భయ త ఇన స ర న - ఒకప్పుడు ఇన్సూరెన్స్ అంటే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారో, పెళ్లయి పిల్లలున్న మధ్యవయస్కులో తీసుకునే ఒక సేవింగ్స్ ఆప్షన్. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. 20ల్లోనే కెరీర్ స్టార్ట్ చేయడం, బైక్‌లు కార్లు కొనడం, ఈఎంఐలు కట్టడంతో పాటు.. అంతే వేగంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా చేతిలో పట్టుకుంటున్నారు జెన్ జెడ్ యువత. గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన 'ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్ 4.0' షాకింగ్ నిజాలను బయటపెట్టింది. భారతదేశంలో ప్రమాదాల బారిన పడి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్న వారి సగటు వయస్సు కేవలం 33 సంవత్సరాలు మాత్రమేనట. ఈ ఒక్క నంబర్ ఇప్పుడు దేశంలోని యువ వర్క్‌ఫోర్స్‌ను ఆలోచనలో పడేస్తోంది.

ప్రమాదాల కోరల్లో యువత.. యాక్సిడెంట్ క్లెయిమ్‌లలో 33% కంటే ఎక్కువ 21 నుండి 30 ఏళ్ల లోపు యువతవేనని డిజిట్ లైఫ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశానికి వెన్నెముక లాంటి వర్కింగ్ క్లాస్ పాపులేషన్ ఇదే. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటూ.. కుటుంబాలను సపోర్ట్ చేస్తున్న ఈ వయసు వారే ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారట. అందువల్లనే నేటి యువత ముందే అలర్ట్ అవుతోంది.

పెరిగిన అవేర్‌నెస్.. పెద్ద పాలసీలు కరోనా తర్వాత అత్యవసర ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి సోషల్ మీడియాలో అవగాహన విపరీతంగా పెరిగింది. ఫలితంగా 21-30 ఏళ్ల లోపు కస్టమర్ల బేస్ సమ్ అష్యూర్డ్ అదే పాలసీ కవరేజ్ అమౌంట్ ఏకంగా 60 శాతానికి పైగా పెరిగింది. యువత కేవలం ఇన్సూరెన్స్ త్వరగా కొనడమే కాదు.. పెద్ద మొత్తంలో కవరేజ్ ఇచ్చే పాలసీలను, అదనపు బెనిఫిట్స్ ఇచ్చే రైడర్లతో కలిపినవి కొంటూ తమ ఫ్యామిలీలకు గట్టి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

క్లెయిమ్‌ల వరద.. ఐటీ హంగులు ఆర్థిక భద్రత అవసరం ఎంతలా పెరిగిందో చెప్పడానికి డిజిట్ లైఫ్ సెటిల్ చేసిన క్లెయిమ్‌ల సంఖ్యే సాక్ష్యం. FY25-26లో ఈ సంస్థ ఏకంగా 59% వృద్ధితో 28వేల658 క్లెయిమ్‌లను సెటిల్ చేసింది. ఇందులో గ్రూప్ మైక్రో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా ఎక్కువగా ఉందట. కస్టమర్ల రద్దీని తట్టుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఏఐ టెక్నాలజీ, వాట్సాప్ చాట్‌బాట్స్ వాడుతున్నాయి. డిజిట్ కాల్ సెంటర్ వాల్యూమ్ ఏకంగా 361% పెరగడం విశేషం.

ఈ రిపోర్టులో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. మెట్రో సిటీల్లో ఉండేవారు సేవింగ్స్ ప్రాడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి 40 ఏళ్లు దాటే వరకు వేచి చూస్తుంటే, నాన్-మెట్రో అంటే చిన్న టౌన్స్ ప్రజలు మాత్రం ఇంకా తక్కువ వయస్సులోనే ఇన్సూరెన్స్ కొంటున్నారట. అలాగే 21-30 ఏళ్ల కేటగిరీలో పురుషుల కంటే మహిళలే ప్రొటెక్షన్ ప్లాన్స్ కొనేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇన్సూరెన్స్ కొనడానికి ఏజెంట్ల చుట్టూ తిరిగే రోజులు పోవటంతో వీక్ డేస్‌లో సోమ, మంగళవారాల్లో పాలసీలు ఎక్కువగా అమ్ముడవుతున్నప్పటికీ.. దాదాపు 20% రిటైల్ అమ్మకాలు శని, ఆదివారాల్లోనే జరుగుతున్నాయట. అంటే యువత వీకెండ్స్‌లో ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్లలోనే డిజిటల్‌గా ఇన్సూరెన్స్ షాపింగ్ చేస్తున్నారన్నమాట. ఒకప్పుడు పెళ్లయ్యాక చూసుకుందాం అనుకునే లైఫ్ ఇన్సూరెన్స్.. మారుతున్న ప్రమాదాల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం కెరీర్ ప్రారంభంలోనే తీసుకుంటున్నారు కుర్రోళ్లు.