IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

ఆ కవలలు మా బిడ్డలు కాదు.. IVF సెంటర్ నిర్వాకంపై కోర్టుకెక్కిన దంపతులు

Published June 14, 2026 · Updated July 21, 2026 · By Thomas Martin - indiabreakingdaily.com

Foto : Thomas Martin - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – ఆ కవలల మ బ డ డల క - ఆ కపుల్ చాలా కాలంగా పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ ద్వారా ఇద్దర కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారిని సంతోషంగా, ఎంతో మురిపెంగా సాకుతున్నారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టారు కదా.. జనరల్ చెకప్ లకు డాక్టర్ దగ్గరి వెళ్లి చెక్ చేయించగా జన్యుపరమైన సమస్యలు ఉన్నట్లు అనుమానం ఉంది.. డీఎన్ ఏ టెస్ట్ చేయించండి అని డాక్టర్లు చెప్పారు. అయితే డీఎన్ ఏ టెస్టు రిపోర్టుతో దంపతులు షాక్ అయ్యారు. ఐవీఎఫ్ సెంటర్ పై కోర్టుకెక్కారు.

పిల్లల కోసం ఐవీఎఫ్(IVF) చికిత్స చేయించుకున్న గురుగ్రామ్‌కు చెందిన ఓ జంటకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన కవల పిల్లలు తమ పిల్లలు కాదని తెలిసి షాక్ కు గురయ్యారు. పిల్లలకు వారికి జీవసంబంధం లేదని డీఎన్ఏ పరీక్షల్లో తేలడంతో కుంగిపోయారు. పిల్లలకు వచ్చిన చిన్న ఆరోగ్య సమస్య కారణంగా పరీక్షలు చేయించగా, జన్యు పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు. ఆ రిపోర్టుల్లో కవలలకు తల్లిదండ్రులతో ఎలాంటి జన్యు సంబంధం లేదని వెల్లడైంది.

చికిత్స సమయంలో వేరే దంపతుల అండాలను అమర్చారా? లేక పుట్టిన తర్వాత పిల్లలు తారుమారు అయ్యారా? అనే అనుమానాలను ఆ దంపతులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఐవీఎఫ్ కేంద్రాన్ని పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన సమాధానం రాకపోవడం పోలీసులకు కూడా ఆశ్రయించారు. అయితే పోలీసులు కూడా స్పందించకపోవడంతో చివరకు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

►ALSO READ | ఛీ.. మీరేం దోస్తులు..! అమెరికా తీరుపై ఎంపీ శశిథరూర్ ఫైర్

సాధారణంగా ఐవీఎఫ్ ప్రక్రియలో రోగుల వివరాలను పలుమార్లు చెక్ చేయడం, స్పెషల్ ఐడెంటిటీ సిస్టమ్ వంటి భద్రతా చర్యలు ఉంటాయి. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆస్పత్రులు, ఐవీఎఫ్ సెంటర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

పిల్లల కోసం ఎన్నో ఆశలతో ఐవీఎఫ్‌ను ఆశ్రయించే దంపతుల విశ్వాసాన్ని కాపాడేందుకు ఆస్పత్రులు, ఐవీఎఫ్ సెంటర్లు మరింత జాగ్రత్తగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెపుతోందని నిపుణులు అంటున్నారు.