IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

అర్నబ్ అప్ డేట్స్: ఏపీలో హై అలర్ట్.. కోస్తా జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు..

Published October 28, 2026 · Updated October 28, 2026 · By Matthew Williams - indiabreakingdaily.com

Foto : Matthew Williams - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – అర నబ అప డ ట స - బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటిన అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ( అక్టోబర్ 28 ) తెల్లవారుజామున తుఫాను తీరం దాటిన సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన రాకాసి గాలులు తీరా ప్రాంతాలను వణికించాయి. రాబోయే 48 గంటల్లో తుఫాను బలహీనపడి అవకాశం ఉందని.. మరో 6 గంటల్లో తుఫాను తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపింది వాతావరణ శాఖ.

ఈ క్రమంలో కోస్తా జిల్లాలకు వరద ముప్పు ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. కాకినాడ, కోనసీమ, ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలెర్ట్ జారీ చేసింది. నదీపరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మరో 24 గంటల పాటు వరద హెచ్చరికలు కొనసాగుతాయని తెలిపింది వాతావరణ శాఖ.

ఇవాళ చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

అక్టోబర్ 29న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

అక్టోబర్ 30న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

రాయలసీమలో ఇవాళ, రేపు ( అక్టోబర్ 28,29 ) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

అక్టోబర్ 30న పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లోద్దని సూచించింది వాతావరణ శాఖ. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లడంపై నిషేధం ఉన్న క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లోద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.

Related Reading

Frequently Asked Questions

What is అర నబ అప డ ట స?

అర నబ అప డ ట స is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does అర నబ అప డ ట స matter?

అర నబ అప డ ట స matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.