IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

అమెరికాలో ఇరాక్ స్ట్రైకర్ అరెస్ట్.. ఆందోళనలో ఫుట్‌బాల్ జట్టు.. 7గంటల పాటు విచారణ

Published June 7, 2026 · Updated July 21, 2026 · By Daniel Wilson - indiabreakingdaily.com

Foto : Daniel Wilson - indiabreakingdaily.com

Indiabreakingdaily.com – అమ ర క ల ఇర క స - FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ కోసం అమెరికాకు వెళ్లిని ఇరాక్ ఫుట్ బాల్ స్ట్రైకర్ అయెమెన్ హుస్సేన్ ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 7 గంటలకు పైగా అతడ్ని విచారణ చేసిన అనంతరం వదిలి పెట్టినట్లు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఫిఫా వరల్డ్ కప్ లో ఇరాకీ జట్టు అర్హత సాధించడంలో హుస్సేన్ కీ రోల్ పోషించాడు.

ఇరాకీ స్ట్రైకర్ ని అదుపులోకి తీసుకున్న అమెరికా: ఇరాకీ ఫుట్ బాల్ జట్టు అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం (జూన్ 6న) నాడు తెల్లవారు జామున స్ట్రైకర్ అయెమెన్ హుస్సేన్ తన టీమ్ తో కలిసి షికాగోలోని ఓహేర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి చేరుకోగానే.. అతడ్ని యూఎస్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో పాటు తన ఫోన్ పూర్తిగా చెక్ చేసిన అనంతరం సుమారు 7 గంటలకి పైగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోకి రావడానికి హుస్సేన్ కి అక్కడి అధికారులు పర్మిషన్ ఇచ్చారు.

అతడిని అమెరికాలోకి నో ఎంట్రీ: ఇరాకీ జట్టు తరపున వచ్చిన ఫోటోగ్రాఫర్ తలాల్ సలాహ్ ని కూడా అధికారులు సుమారు 10 గంటల పాటు నిర్భందించి.. అతడి ఫోన్ చెక్ చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. కానీ అతడ్ని అమెరికాలోకి ప్రవేశించేందుకు నిరాకరించినట్లు తెలిపాయి. అయితే ఈ ఘటనపై అటు ఇరాకీ ఫుట్ బాల్ అసోసియేషన్ గానీ, ఇటు అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు కానీ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.

39 రోజుల పాటు మెగా టోర్నీ: ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ జూన్ 11వ తేదీ నుంచి జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 39 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఫిఫా ప్రపంచకప్ లో గ్రూప్– ఐలో ఇరాక్ ఉంది. ఈ గ్రూప్ లోనే ఫ్రాన్స్, సెనెగల్, నార్వే దేశాల ఫుల్ బాల్ జట్లు కూడా ఆడుతున్నాయి.