ముంబైలో శాకాహార కుటుంబాలకే అందే భవనం
Indiabreakingdaily.com – సముద్ర తీరం వద్ద ఉన్న అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది. దీని ధర 6 కోట్ల 50 లక్షల రూపాయలు. సాధారణంగా ఇంత ధర ఉంటే కొనుగోలుదారులు ఎదురుచూస్తారు. కానీ ఇక్కడ ఓ షరతు ఉంది. శాకాహార కుటుంబాలకే ఈ ఫ్లాట్ అమ్ముతామని యాజమాన్యం ప్రకటించింది.
దేశంలో ఇంత ఖరీదైన ప్రాపర్టీని అమ్ముతున్నప్పుడు కొనుగోలుదారుడికి షరతులు విధించడం విశేషం. ఈ విషయంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.
ఫ్లాట్ వివరాలు
టార్డియో ప్రాంతంలో ఉన్న ఈ 2BHK ఫ్లాట్ సుమారు 900 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో వచ్చింది. దీనిలో అటాచ్డ్ బాల్కనీ ఉంది. దక్షిణ ముంబై సముద్ర దృశ్యాలు కనిపిస్తాయి. సర్ఫేస్ పార్కింగ్ మరియు పోడియం పార్కింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.
లిస్టింగ్‌లో “వెజిటేరియన్స్ ఓన్లీ” అని స్పష్టంగా రాసి ఉంది. దీంతో మాంసాహారులు ఇక్కడ నివసించవచ్చా అనే ప్రశ్న ఎదురవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్
ప్రాపర్టీ డీలర్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్ భవేష్ కవారే ఈ ఫ్లాట్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకు 46 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 700కు పైగా లైక్స్ కూడా లభించాయి.
ఇండ్లు అద్దెకు ఇచ్చేవారు శాఖాహారులకు మాత్రమే అని పెట్టడం చూశాం కానీ.. అమ్మే వారు కూడా శాఖాహారులకు మాత్రమే అనే బోర్డు పెట్టడం అంటే.. మాంసాహారులపై వివక్ష చూపించడమే కదా
ఈ వీడియో తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరింది. దీనిపై డిబేట్ మొదలైంది.
వివక్షపై ప్రశ్నలు
సోషల్ మీడియాలో చాలా మంది ఆహార అలవాట్ల ఆధారంగా ఇండ్లు కేటాయించడం సరైనదేనా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.
షిండే సేన యువ నేత గుర్జ్యోత్ సింగ్ కీర్ ఈ లిస్టింగ్‌ను విమర్శిస్తూ, మరాఠీలకు అనుమతి లేదా అనే ప్రశ్నలు లేవనెత్తారు.
ముంబైలో ఆహార అలవాట్లు, కమ్యూనిటీ ఆధారంగా సొసైటీలు ఆంక్షలు విధించడంపై ఇప్పటికే చర్చ జరుగుతోంది.
స్పష్టత లేని షరతు
ఈ శాకాహారులకు మాత్రమే నిబంధన సొసైటీ అధికారిక నిబంధనా.. లేక ఓనర్ కండిషనా.. లేదా బ్రోకర్ వివరణా అనేది స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ ఈ వైరల్ లిస్టింగ్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఆహార అలవాట్ల ఆధారంగా ఆంక్షలు సరైనవా అనే ప్రశ్నలను మళ్లీ రేకెత్తించింది.
కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష, జాతి వివక్ష.. ఇలా ఇండియాలో ఎన్నో రకాల డిస్క్రిమినేషన్స్ మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతూనే ఉన్నాయి. భారతీయ సమాజం అలా ముందుకు సాగుతూనే ఉంది. నవనాగరికతను దాటుకుంటూ టెక్నాలజీ మీదుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం. అయినా సమాజంలో ఇలాంటి ధోరణలు పెరిగిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
A post shared by Kaware Bhavesh (@propertytransactionguru)
Related Reading
Frequently Asked Questions
What is ర 6 5 క ట ల అప?
ర 6 5 క ట ల అప is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ర 6 5 క ట ల అప matter?
ర 6 5 క ట ల అప matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



