ఏఐ గురించి కంగారు పడుతున్నారా.. భారత టెక్కీలకు శుభవార్త చెప్పిన నోమురా

ai-is-creating-more-jobs-than-it-is-replacing-in-india-nomura-latest-report-says_sBbwO0IM8J

ఏఐ భారతదేశంలో ఉద్యోగాలను రూపొందిస్తోంది: నోమురా నివేదిక

ఉద్యోగ నష్టాల భయం వెనుక ఉన్న వాస్తవం

Indiabreakingdaily.com – ఏఐ గ ర చ క గ ర – ఏఐ సాంకేతికత వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ జపాన్ ఆర్థిక సంస్థ నోమురా తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ భయాన్ని కొంతవరకు తగ్గిస్తోంది. భారతదేశంలో ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారి కంటే కొత్తగా ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలకు బ్యాక్ ఆఫీస్ సేవలు అందిస్తున్న భారత్.. ఏఐ ప్రభావాన్ని అంచనా వేయడానికి కీలక దేశంగా మారిందని నోమురా పేర్కొంది.

భారతదేశంలో ఏఐ ఉద్యోగ ప్రభావం

2022 నుండి 2026 ఆగస్టు వరకు గల కాలంలో భారత్‌లో ఏఐ సంబంధిత రంగాల్లో 83,100 మంది కొత్తగా ఉద్యోగాలు పొందగా.. కేవలం 31,921 మంది మాత్రమే ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. ఆసియాలోని 69 సంఘటనలను విశ్లేషించిన తర్వాత ఈ వివరాలను నోమురా వెల్లడించింది.

ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది కస్టమర్ సపోర్ట్ వంటి రోల్స్‌లో పనిచేసేవారే. ఈ పనులను చాట్‌బాట్‌లు, AI టూల్స్ భర్తీ చేస్తున్నాయి. మరోవైపు ఏఐ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ముఖ్యంగా ఐటీ సర్వీసెస్ రంగంలో కొత్త గ్రాడ్యుయేట్లను పెద్ద ఎత్తున నియమిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

ఉద్యోగ రూపంలో మార్పు, ఉద్యోగ నష్టం కాదు

AI ప్రభావం అందరిపై ఒకేలా ఉండడం లేదని నోమురా హెచ్చరించింది. భారత్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై డిమాండ్ తగ్గుతుండగా, వ్యాపార అనుభవం ఉన్న, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణుల అవసరం పెరుగుతోందని పేర్కొంది.

ఏఐ కారణంగా ఉద్యోగాల స్వరూపం మారుతోంది కానీ.. ఉద్యోగాలే పూర్తిగా మాయమవుతున్నాయని చెప్పడం సరైంది కాదు.

ఆసియా వ్యాప్తంగా ధోరణి

ఆసియా వ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. పరిశీలించిన కాలంలో ఏఐ సంబంధిత రంగాల్లో లక్షా 30వేల 758 కొత్త ఉద్యోగాలు సృష్టించబడగా, 60వేల 654 ఉద్యోగాలు మాత్రమే తగ్గాయి.

కొత్త ఉద్యోగాల్లో 90 శాతానికి పైగా టెక్నాలజీ రంగంలో ఉండగా.. సుమారు 60 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఉన్న వారు జాబ్స్ కోల్పోతున్నారని నివేదిక వెల్లడించింది.

ఉద్యోగాలు కోల్పోయిన వారు నేరుగా ఏఐ ఇంజినీరింగ్ వంటి కొత్త అవకాశాల్లోకి వెళ్లడం అంత సులభం కాదని, అందువల్ల ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు అన్ని వర్గాలకూ సమానంగా ఉండవని నోమురా స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ప్రారంభ దశలో ఉన్నందున.. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయో కాలమే నిర్ణయిస్తుందని పేర్కొంది నోమురా.

Frequently Asked Questions

What is ఏఐ గ ర చ క గ ర?

ఏఐ గ ర చ క గ ర is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఏఐ గ ర చ క గ ర matter?

ఏఐ గ ర చ క గ ర matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *