నల్గొండ రైతులకు సహకార రుణ సమస్యలు తీవ్రం
Indiabreakingdaily.com – ర త లక క పర ట వ – పంట సీజన్ ప్రారంభమై ఉన్నప్పటికీ నల్గొండ ఉమ్మడి జిల్లాలో సహకార బ్యాంకుల నుండి రైతులకు పంట రుణాలు అందడం లేదు. టెస్కాబ్ నుండి డీసీసీబీలకు నిధుల కేటాయింపులు ఆగిపోవడం వల్ల వేలాది మంది వ్యవసాయదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకవర్గాల లేమి మరియు అధికారుల నిర్ణయాలు లేకపోవడం వల్ల సహకార రుణ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.
రుణ వ్యవస్థలో నిధుల కొరత
సాధారణంగా నాబార్డ్ నుండి టెస్కాబ్‌కు, అక్కడి నుండి డీసీసీబీలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలు అందుతాయి. నిబంధనల ప్రకారం రైతులకు 7 శాతం లోపు వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం టెస్కాబ్ వద్ద సొంత నిధులు లేకపోవడంతో నాబార్డ్ రీఫైనాన్స్ పై ఆధారపడాల్సి వస్తోంది.
దీంతో చివరికి రైతు వద్దకు వచ్చేసరికి వడ్డీ రేటు 8 శాతానికి పైగా దాటుతోంది. 7 శాతానికి మించి వడ్డీ భారం పడకూడదనే నిబంధన ఉండటం, అదనపు భారాన్ని భరించేందుకు నిధులు లేకపోవడంతో టెస్కాబ్ క్రాప్ లోన్ల కేటాయింపులను నిలిపివేసింది.
డీసీసీబీలు, టెస్కాబ్ వద్ద సొంత నిధులు పుష్కలంగా ఉంటే, కొంత మార్జిన్ చూసుకొని రైతులకు 7 శాతానికే రుణాలు ఇచ్చే అవకాశం ఉండేది.
జిల్లాల్లోని డీసీసీబీలలో నిధుల కొరత తీవ్రంగా ఉంది. కొన్ని బ్యాంకుల వద్ద కాస్తో, కూస్తో నిధులు ఉన్నప్పటికీ, అన్ని ప్రాంతాల రైతులకు సమంగా పంచలేక, వివాదాలు ఎందుకని అసలు రుణాల పంపిణీనే పక్కన పెట్టేశారు.
జిల్లా సహకార బ్యాంకుల ప్రగతి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీసీసీబీ పరిధి లో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి. రైతులకు రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వడంతో పాటు రికవరీ కూడా అంతే వేగంగా చేస్తూ వాణిజ్య బ్యాంకుల కంటే అధికంగా రుణాలు మంజూరు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.328.35కోట్ల నుండి రూ.623.91కోట్లకు క్రాప్ లోన్లు పెరిగి అదనంగా రూ.295.56 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు.
కొన్నేండ్ల కింద రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ స్థానం చివరి నుండి రెండోదిగా ఉండగా, గత ఆర్దిక సంవత్సరం రెండో స్థానానికి చేరింది. దీంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్రంతో పాటు ఆర్‌బీఐ వద్ద గుర్తింపు లభించింది. గత ఆర్థిక సంవత్సరం సైతం దాదాపు రూ.3 వేల కోట్లకు టర్నోవర్ చేరింది.
ప్రస్తుత సమస్యలు మరియు పరిష్కారాలు
ప్రస్తుతం వడ్డీ భారంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టాల్సిన ఆడిట్ చేయకపోవడంతో ఆర్బీఐ నుండి సైతం రుణాలు మంజూరు చేసేందుకు అనుమతులు రాకపోవడంతో రైతులకు అందించాల్సిన రుణాలను మంజూరు చేయడం లేదని డీసీసీబీ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం సహకార సంఘాలు, డీసీసీబీలకు ఎన్నికలు జరగక పాలకవర్గాలు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపంగా మారింది. ప్రజాప్రతినిధులు, చైర్మన్ ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తెప్పించేవారు. అధికారులు మాత్రం ఈ సమస్యను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
సర్కార్ కూడా ఈ విషయంలో ఎలాంటి చొరవ చూపకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టెస్కాబ్, డీసీసీబీల ద్వారా క్రాప్ లోన్లు విడుదల అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
Related Reading
Frequently Asked Questions
What is ర త లక క పర ట వ?
ర త లక క పర ట వ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ర త లక క పర ట వ matter?
ర త లక క పర ట వ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



