డీ లిమిటేషన్‎పై వెనక్కి తగ్గేది లేదు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

Share: X Facebook
modi-govt-likely-to-call-special-session-on-delimitation-bill_H2I8aVveJP

ప్రత్యేక సమావేశాల ద్వారా బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం

Indiabreakingdaily.com – డ ల మ ట షన ప వ – కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రత్యేక సెషన్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చించడానికి ఆగస్ట్ 16, 17, 18 తేదీలను ఖాతరు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాలు ఆగస్ట్ 13న ముగియనున్నాయి. ఈ సందర్భంగానే ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం, అయోధ్య రామ మందిర విరాళాల చోరీ సంఘటన, మరియు విద్యార్థులపై పోలీసులు బల ప్రయోగం చేయడం వంటి అంశాలపై విపక్షాలు పట్టుబట్టడంతో సభ పనితీరు ప్రభావితమైంది. ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లులను సభలో టేబుల్ చేయడం కష్టమైంది.

డీలిమిటేషన్ బిల్లు విషయంలో ప్రభుత్వం ఎటువంటి వెనుకడుగు వేయదని స్పష్టమవుతోంది. వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ప్రత్యేక సెషన్‌ను నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంట్‌ను ప్రొరొగ్ చేయకుండా ఆగస్ట్ 16, 17, 18 తేదీల్లో ఈ సెషన్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రత్యేక సెషన్‌లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు కేంద్రం కృషి చేస్తోంది.

గతంలో బిల్లు విఫలమైన నేపథ్యం

మోడీ సర్కార్‌కు డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో గతంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్లను వేగవంతం చేయడానికి, 2011 జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి 2026 ఏప్రిల్‌లో లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ రాకపోవడంతో అది వీగిపోయింది.

లోక్ సభలో మొత్తం 528 మంది ఎంపీలు ఓట్లు వేశారు. అందులో 298 మంది అనుకూలంగా ఓటేయగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేసారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండో వంతు మెజారిటీ అవసరం. అంటే 358 ఓట్లు రావాల్సి ఉండగా, కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్‌కు 54 ఓట్లు తక్కువగా ఉన్నాయి.

మహిళా కోటాకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడంతో విపక్షాలు పూర్తిగా వ్యతిరేకించాయి. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అయితే, ప్రతిపక్షాల డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మద్దతు కోసం సభలో ఓటింగ్‌కు పెట్టింది. మ్యాజిక్ ఫిగర్ ఓట్లు రాకపోవడంతో బిల్లు విఫలమైంది.

Frequently Asked Questions

What is డ ల మ ట షన ప వ?

డ ల మ ట షన ప వ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does డ ల మ ట షన ప వ matter?

డ ల మ ట షన ప వ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *