జీవితానుభవాల అక్షర సంతకం.. అనుభవాలను, ఆలోచనలను నెమరువేసే పుస్తకాలు

Share: X Facebook
7a41e5c5-7d0a-4b5b-b8b1-6530a6a24d7f-0

జీవితానుభవాల అక్షర సంతకం.. అనుభవాలను, ఆలోచనలను నెమరువేసే పుస్తకాలు

పుస్తకం ప్రభావం ఎంత గొప్పది!

జ వ త న భవ ల అక – కొన్ని పుస్తకాలు చదివినంత చేసే మనం మనకు ఉంటాయి. చదివాక కూడా చాలాసేపు మన ఆలోచనల్లో నిలిచి, మన అనుభవాల్ని నెమరువేసేలా చేస్తాయి. డా. ఎస్. రఘు గారి జీవనలిపి పుస్తకం అచ్చం అలాంటిదే. మన జీవిత సత్యాలు, మానవ అనుభవాలు, సామాజిక అంశాలను కేవలం నాలుగు పాదాల్లో, ఇరవై నుంచి ఇరవై ఐదు అక్షరాల పరిధిలో వ్యక్తం చేయగలమనే సత్యాన్ని ఈ పుస్తకం రుజువు చేస్తుంది.

“నావీ నీవీ వెరసి మనవి”

సంకలనంలో ఉన్న ప్రత్యేక స్థానం కోసం!

“నానీ”ల ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. విస్తృతమైన భావాన్ని అత్యల్ప పదాల్లో హృదయానికి హత్తుకునేలా చెప్పడం ఈ నానీలకు ఉన్న అసలైన బలం. ఆ బలాన్ని సమకాలీన జీవితం, మానవ సంబంధాలు, హాస్యం, వ్యంగ్యం, తాత్వికతలతో సమన్వయపరిచి పాఠకుడి ముందుంచిన రచన జీవనలిపి.

ఆధునిక సమాజం తో అనుభవాల సౌందర్యం!

పాఠకుణ్ణి తన భావప్రపంచంలోకి ఆహ్వానించే అరుదైన ఆకర్షణ జీవనలిపి సొంతం. ఒక్కో నానీ ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతూ, ఒక్కో అనుభూతిని మేల్కొలుపుతూ జీవితంలోని చిన్నచిన్న సంఘటనల వెనుక ఉన్న పెద్ద పెద్ద సత్యాలను సైతం గుర్తుచేస్తుంది. ఇది కేవలం నానీల సంకలనం కాదు, జీవితానుభవాలను సూక్ష్మాక్షరాల్లో లిఖించిన ఒక అనుభూతి ప్రపంచం.

“దొంగ వర్షం/ బడికెళ్లాక కురుస్తుంది!/ దొంగ జ్వరం/ ఇంట్లోనే వస్తుంది!”

నానీల జీవితానుభవాల వ్యక్తీకరణ!

యవ్వనానుభవాలను, ప్రేమలోని మాధుర్యాన్ని ఆవిష్కరించే నానీలలో “ప్రేమికులు/ పాతబడిపోయారు/ ప్రేమలేఖల అవసరం/ మళ్లీ వచ్చింది!” అనేది ఈ డిజిటల్ యుగంలో క్రమంగా కనుమరుగవుతోన్న ప్రేమలేఖల మాధుర్యాన్ని గుర్తుచేస్తుంద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *