ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఎత్తేసిన ఢిల్లీ సర్కార్.. ఎందుకంటే?

Share: X Facebook
433b27b6-009d-4d96-b51b-02dab2e76829-0

ప రభ త వ ఉద య గ – ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై వారంలో రెండు రోజులు ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉండదు. ఎందుకంటే సీఎం రేఖా గుప్తా కీలక గతంలో ప్రకటించిన వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానాన్ని రద్దు చేశారు కాబట్టి. భౌగోళిక-రాజకీయ పరిస్థితులు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో మళ్లీ సాధారణ విధానంలో పనిచేయనున్నాయి.

ఇప్పటివరకు బుధవారం, శనివారం రోజుల్లో అమల్లో ఉన్న వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని ఉపసంహరించేందుకు ఢిల్లీ సీఎం ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెంటనే జారీ చేయనున్నట్లు సీఎంఓ వెల్లడించింది. అయితే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అమల్లో ఉన్న వేర్వేరు కార్యాలయ సమయాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కార్యాలయాల సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అవి ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.

వెస్ట్ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళనలతో కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వం ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేసింది. వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్, మంత్రులు సోమవారం మెట్రోలోనే ప్రయాణించే 'మెట్రో మండే', విదేశీ పర్యటనలపై ఏడాది పాటు నిషేధం, 6 నెలల పాటు కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, హైబ్రిడ్ ప్రభుత్వ వాహనాల కొనుగోళ్ల నిలిపివేత వంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రతి వారం ఒక రోజు వ్యక్తిగత వాహనాలు ఉపయోగించకుండా ఉండాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు కొంతవరకు సాధారణ స్థితికి చేరుకోవడం, ఇంధన ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో ఈ తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇకపై పూర్తిస్థాయిలో సాధారణ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *