తాగునీటికి ఇబ్బంది రానివ్వం… తాత్కాలికంగా దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తును పెంచుతాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

thummala-nageswara-rao-comments-on-dummugudem-barrage-hieght_o5aLMEvFGj

Indiabreakingdaily.com – త గ న ట క ఇబ బ – మణుగూరు/ జూలూరుపాడు/​ దమ్మపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంచి తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుతో కలిసి సీతారామ ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దుమ్ముగూడెం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.8 టీఎంసీలకు గాను 0.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందని, ఆనకట్ట వద్ద ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి నీటి నిల్వను పెంచే అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ ఆఫీసర్లకు సూచించారు.

ఒక టీఎంసీకి పైగా నీటిని నిల్వ చేసుకుంటే రానున్న నెలల్లో తాగునీటి అవసరాలను తీర్చవచ్చన్నారు. వివిధ అనుమతులు, న్యాయపరమైన అడ్డంకుల కారణంగా ఐదేళ్లుగా సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. నవంబర్ లో సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా జిల్లా యంత్రాంగం, నీటిపారుదల శాఖ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు.

జూలూరుపాడు మండలం పాపకొల్లు వద్ద సీతారామ కాలువ టన్నెల్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరావు పరిశీలించారు. గత ప్రభుత్వం కాలువ నిర్మాణాన్ని చేపట్టలేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత టన్నెల్ ద్వారా కాలువను కొనసాగించి తక్కువ ఖర్చుతో పాలేరుకు నీరు అందించాలని నిర్ణయించామన్నారు.

ఏడాదిలోనే టన్నుల్ ను పూర్తి చేసి పాలేరుకు నీరు అందిస్తామన్నారు. ఈ టన్నెల్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న చెరువులన్నింటినీ గోదావరి జలాలతో నీరునింపుకోవచ్చన్నారు. మంత్రి తుమ్మలను ఆయన నివాసంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మర్యాదపూర్వకంగా కలిశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పొలాలు ఎండకుండా సీతారామ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించినందుకు ఆమె మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.

Frequently Asked Questions

What is త గ న ట క ఇబ బ?

త గ న ట క ఇబ బ is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does త గ న ట క ఇబ బ matter?

త గ న ట క ఇబ బ matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *