Indiabreakingdaily.com – షమ వ షయ ల మ వ ఆన – భారత టీ20 జట్టులోకి సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) దాదాపు నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సెలెక్టర్లు తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచినప్పటికీ, పలువురు దిగ్గజాలు దీనిని స్వాగతిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున భువీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) తాజాగా ఈ రీఎంట్రీపై స్పందిస్తూ.. సెలెక్టర్ల తెగువను అభినందించారు.
* సొషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్‌ను మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం అంత తేలికైన విషయం కాదన్నారు. భారత జట్టులోకి అతన్ని తిరిగి తీసుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. మొదటగా, ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు ముందుకు వచ్చిన సెలెక్టర్లకు నా అభినందనలని కార్తీక్ ప్రశంసించారు. గత కొంతకాలంగా భారత్ ఎంతో మంది యువ పేసర్లను పరీక్షించిందని, అయితే కేవలం నైపుణ్యం పరంగా చూస్తే భువీ స్థాయి వేరని ఆయన కొనియాడారు.
ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ ప్రదర్శనను దగ్గరగా చూసిన కార్తీక్.. అతని బౌలింగ్ ప్రత్యేకతలను గుర్తు చేశారు. భువీ అందించే క్వాలిటీ అద్భుతమైనది. అతను కొత్త బంతితో ఇరువైపులా స్వింగ్ చేయగలడు. అలాగే డెత్ ఓవర్లలో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని బౌలింగ్ చేయగల అనుభవం అతని సొంతం అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నారు.
గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో భువనేశ్వర్ కుమార్ కనబరిచిన స్థిరమైన ప్రదర్శనే అతని పునరాగమయానికి బాటలు వేసిందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుతమైన వికెట్లు తీసి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన భువీ.. ఈ అవకాశం పూర్తిగా అర్హుడని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తను మిగిలిన సమయాన్ని ఆస్వాదిస్తూ, సంతోషంగా ఆడాలని ఆకాంక్షించారు.
హాంకాంగ్ సిక్సెస్ కెప్టెన్సీ నుంచి నేషనల్ టీమ్ దాకా: హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన భువనేశ్వర్‌కు, ఆ వెంటనే టీమిండియా నుంచి కూడా పిలుపురావడం మరింత ఆనందాన్నిచ్చిందని కార్తీక్ సంతోషం వ్యక్తం చేశారు. ముందుగా హాంకాంగ్ సిక్సెస్ కెప్టెన్ అని విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది, ఇప్పుడు నేషనల్ టీమ్‌లోకి రావడం మరింత గొప్ప వార్త అంటూ భువీపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
DK watching Bhuvi make his comeback like the proudest mentor ever, this is so wholesome 🥹❤️ https://t.co/6oXZQ748S7
Related Reading
Frequently Asked Questions
What is షమ వ షయ ల మ వ ఆన?
షమ వ షయ ల మ వ ఆన is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does షమ వ షయ ల మ వ ఆన matter?
షమ వ షయ ల మ వ ఆన matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.



