ఒక్క జూమ్ కాల్తో 900 మందిని తీసేసిన CEO.. ఇప్పుడు రోడ్డున పడ్డాడు.

company-ruthlessly-fires-ceo-who-laid-off-900-people-in-a-single-zoom-call_MQj5RKeFb4

ఒక్క జూమ్ కాల్‌లో 900 మందిని తీసేసిన సీఈఓ.. ఇప్పుడు రోడ్డున పడ్డాడు

Indiabreakingdaily.com – ఒక క జ మ క ల త – శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వచ్చిన ఒక మాస్ డైలాగ్ ఇప్పుడు గుర్తుకు వస్తోంది. వంద గొడ్లను తిన్న రాబందును ఒక్క తుపానుకు చంపేస్తుంది అనేది ఆ మాట. అచ్చం అలాంటి పరిస్థితి ఇప్పుడు జరిగింది. ఏ మాత్రం జాలి లేకుండా, కనికరం లేకుండా.. కేవలం మూడు నిమిషాల్లో 900 మంది ఉద్యోగుల జీవితాలను రోడ్డుపాలు చేసిన సీఈఓ.. తన స్థానం కూడా కోల్పోయాడు.

తన పదవిని చూసుకుని ఉద్యోగులను తుచ్ఛంగా భావించిన ఆ సీఈఓను కంపెనీ తొలగించింది.

2021లో జరిగిన సంచలనం

2021 సంవత్సరంలో బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి చీఫ్ ఎక్జిక్యూటివ్‌గా విశాల్ గార్గ్ పనిచేశాడు. ఇండో-అమెరికన్ ఆంత్రప్రెన్యువర్ అయిన గార్గ్.. క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న జూమ్ మీటింగ్ ద్వారా అంత మందిని పంపించేశాడు. ఆ సమయంలో ఆయన నెగటివ్‌గానో, పాజిటివ్‌గానో ఏదో ఒక రకంగా పూర్తిగా పాపులర్ అయ్యాడు.

ఇండియాలో జన్మించిన గార్గ్.. న్యూయార్క్‌లో పెరిగాడు. న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పట్టా పుచ్చుకున్న ఆయన.. ఆన్‌లైన్‌లో స్టూడెంట్స్‌కు అప్పులు ఇచ్చే మై రిచ్ అంకుల్ (My RichUncle) సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత 2014లో బెటర్ అనే సంస్థను ప్రారంభించాడు. సంప్రదాయ మార్ట్గేజ్ విధానానికి విసుగు చెంది బెటర్‌ను స్థాపించి పాపులర్ అయ్యాడు.

సీఈఓ స్థానం కోల్పోయిన విధానం

కంపెనీలోకి హెడ్జ్-ఫండ్ మేనేజర్ డేనియల్ లెవిస్ జాయిన్ అయిన తర్వాత గార్గ్‌ను సాగనంపారు. నీకంటే బెటర్ సీఈఓ వచ్చాడు బాబు.. నీ సేవలు ఇక చాలు అంటూ.. లెటర్ చేతిలో పెట్టారు. గార్గ్ ఒక్కడు తప్ప బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ ముక్తకంఠంతో ఆయనను టర్మినేట్ చేసేందుకే ఓటు వేశారు.

ఆయన అహంకారం, ఏకపక్ష నిర్ణయం, అంతా నాదే అని క్రెడిట్ చేసుకునే విధానంపై అందరూ వ్యతిరేకంగా ఓటు వేశారు.

కంపెనీని ఈయన చేతిలో పెడితే.. 2022 నుంచి 14 వందల 342 కోట్ల రూపాయలు (1.5 బిలయన్ డాలర్లు) లాస్ వచ్చిందట కంపెనీకి. గార్గ్ నాయకత్వంలో స్టాక్ కూడా 90 శాతానికి పడిపోయింది.

విమర్శల మధ్య లీవ్, తిరిగి వచ్చి.. తొలగింపు

2021 డిసెంబర్ లో గార్గ్.. ఒకే ఒక్క జూమ్ కాల్ లో 900 మందిని తొలగించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో కొన్నాళ్లు లీవ్ లో వెళ్లాడు. ఆ తర్వాత సీఈఓగా చేరాడు. ఈ ఘటనపై విమర్శలు వస్తున్నా.. అది కంపెనీ నిర్ణయంలో భాగమేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

మనం గెలుస్తున్నాం.. మనకు మూడురెట్ల లోన్ వాల్యూమ్ పెరిగింది.. మనం లాభాల్లోకి వచ్చేస్తున్నాం.. అంటూ ఊదరగొడుతూ.. 5 ఏండ్లు కంపెనీని నాషనం చేశాడని బోర్డు మెంబర్లు గుర్రుగా ఉన్నారు.

దీంతో వ్యతిరేకంగా ఓటు వేసి తొలగించారు.

Frequently Asked Questions

What is ఒక క జ మ క ల త?

ఒక క జ మ క ల త is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does ఒక క జ మ క ల త matter?

ఒక క జ మ క ల త matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *